News

టీడీపీ నేత కుటుంబసభ్యులను లోకేష్‌ పరామర్శ


చిత్తూరు జిల్లాలో ఐరాల మండలం అడపగుండ్లపల్లిలో ఇటీవల మరణించిన టీడీపీ నేత మహదేవనాయుడు కుటుంబసభ్యులను నారా లోకేష్‌ పరామర్శించారు. మహదేవనాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని లోకేష్‌ అన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పటిష్ఠానికి మహదేవనాయుడు ఎనలేని కృషి చేశారని లోకేష్‌ గుర్తు చేశారు. మహదేవనాయుడి కుటుంబాన్ని ఆదుకుంటామని లోకేష్‌ ప్రకటించారు.